కండల వీరుడికి చెర్రీ సలహాలు ఇస్తున్నాడా? - Telugu Its Telugu

728x90 AdSpace

Wednesday, 7 October 2015

కండల వీరుడికి చెర్రీ సలహాలు ఇస్తున్నాడా?



బాలీవుడ్ కండల వీరుడికి దక్షిణాది సినిమాల మీద మోజు ఎక్కువే అని చెప్పవచ్చు. ఎందుకంటే దక్షిణాది సినిమాలను రీమేక్ చేసి మంచి సూపర్ డూపర్ హిట్ లను కొట్టాడు. దాంతో దక్షిణాదిలో ఏదైనా సినిమా విడుదలకు సిద్దం అవుతుందంటే ఆ సినిమా మీద ఓకన్నేసి ఉంచుతాడు. కండల వీరుడు తన బాడికి తగ్గట్టుగా సినిమాలను ఎంపిక చేసుకొనే విషయంలో మెగా పవర్ స్టార్ చరణ్ సలహాలను ఫాలో అవుతున్నాడు.
తమిళంలో సూపర్ హిట్ అయ్యిన 'తనీ ఒరువన్' సినిమా హిందీ రీమేక్ లో సల్మాన్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో సల్మాన్ నటించటానికి చరణ్ ప్రేరణ అని సమాచారం. ఎందుకంటే తెలుగు రీమేక్ లో రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందీ రీమేక్ లో సల్మాన్ నటిస్తే బాగుంటుందని చరణ్ సూచించాడట. అంతేకాక చిరు చేస్తున్న 150 వ సినిమా 'కత్తి' ని కూడా హిందీలో రీమేక్ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడట. సల్మాన్ ఖాన్ కు మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబందాలు ఉన్నాయి. మొన్న చిరు పుట్టినరోజు వేడుకల్లో కూడా సందడి చేసాడు. ఆ చనువుతోనే చరణ్ సల్మాన్ కి సలహాలు ఇస్తున్నాడని సమాచారం.
కండల వీరుడికి చెర్రీ సలహాలు ఇస్తున్నాడా? Reviewed by Unknown on 11:45 Rating: 5 బాలీవుడ్ కండల వీరుడికి దక్షిణాది సినిమాల మీద మోజు ఎక్కువే అని చెప్పవచ్చు. ఎందుకంటే దక్షిణాది సినిమాలను రీమేక్ చేసి మంచి సూపర్ డూపర్ హిట్ ల...

No comments: