గోన గన్నారెడ్డి వెనక బిజినెస్ డీల్ ఉందా? - Telugu Its Telugu

728x90 AdSpace

Saturday, 10 October 2015

గోన గన్నారెడ్డి వెనక బిజినెస్ డీల్ ఉందా?


'రుద్రమదేవి' కోసం గుణశేఖర్ 10 సంవత్సరాలు రిసెర్చ్ చేసి కథను తయారుచేసుకొని సంపాదించినది అంతా రుద్రమదేవి మీద పెట్టేసాడు. సినిమా విడుదల అయ్యాక రుద్రమదేవి కన్న గోన గన్నారెడ్డికే ఎక్కువ పేరు వచ్చింది. ఈ విధంగా పేరు రావటం వెనక ఏమైనా బిజినెస్ డీల్ ఉందా అనే అనుమానం రాక మానదు. ఈ పాత్రను అంతా పవర్ ఫుల్ గా చెక్కటానికి పెద్ద బిజినెస్ డీల్ ఉన్నట్టు తెలుస్తుంది. మొదట  పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ వ్రాసినప్పుడు గోన గన్నారెడ్డి  పాత్ర కేవలం గెస్ట్ రోల్ కి మాత్రమే పరిమితం. అయితే సినిమా ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆగినప్పుడు అల్లు అరవింద్ సాయం చేయటమే కాకా తన కొడుకు పాత్ర పవర్ ఫుల్ గా ఉండాలని చెప్పాడట. అంతేకాక కేవలం లేడి ఓరియంటెడ్ సినిమా అయితే బిజినెస్ కూడా కష్టం అయ్యింది. దాంతో బన్ని సన్నివేశాలను పెంచి రుద్రమదేవికి సంబందించిన కొన్ని సన్నివేశాలను తీసేసినట్టు టాక్. అలాగే బన్ని పాత్ర మీద ఎక్కువ దృష్టి పెట్టి తెలంగాణా యాసలో  అల్లుఅర్జున్ కు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారట. ఇప్పుడు ఈ పాత్రే జనాల్లోకి వెళ్లి గుణశేఖర్ కి కాసులను కురిపిస్తుంది.
గోన గన్నారెడ్డి వెనక బిజినెస్ డీల్ ఉందా? Reviewed by Unknown on 20:12 Rating: 5 'రుద్రమదేవి' కోసం గుణశేఖర్ 10 సంవత్సరాలు రిసెర్చ్ చేసి కథను తయారుచేసుకొని సంపాదించినది అంతా రుద్రమదేవి మీద పెట్టేసాడు. సినిమా విడు...

No comments: