బిజీ బిజీగా మారుతున్న కింగ్ - Telugu Its Telugu

728x90 AdSpace

Wednesday, 7 October 2015

బిజీ బిజీగా మారుతున్న కింగ్


ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోలు అందరూ నిదానంగా సినిమాలు చేసుకుంటూ పోతూంటే నాగార్జున మాత్రం యంగ్ హీరోలతో పోటీ పడి మరీ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం 'సోగ్గాడే చిన్ని నాయనా', 'ఊపిరి' సినిమాలను చేస్తున్న నాగ్ మరో సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. అంతేకాక ఈ సినిమాలు మధ్యలో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' సీజన్ 3 షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది. 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా ప్రస్తుతం డబ్బింగ్ పనులలో ఉంది.

'ఓనమాలు' సినిమా ద్వారా తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయటానికి రెడీ అయ్యాడు. మొదట ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా నటిస్తాడని స్టేట్మెంట్ వచ్చింది. కానీ చివరి నిమిషంలో వెంకటేష్ తప్పుకోవటం....క్రాంతి మాధవ్ ఈ కథను నాగ్ కి విన్పించటం నాగ్ ఒకే చెప్పటం వెంట వెంటనే జరిగిపోయాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలేక్కుతుందని సమాచారం.
బిజీ బిజీగా మారుతున్న కింగ్ Reviewed by Unknown on 11:32 Rating: 5 ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోలు అందరూ నిదానంగా సినిమాలు చేసుకుంటూ పోతూంటే నాగార్జున మాత్రం యంగ్ హీరోలతో పోటీ పడి మరీ సినిమాలు చేస్తున...

No comments: