కండల విరుడుతో అనిత - Telugu Its Telugu

728x90 AdSpace

Thursday, 30 April 2015

కండల విరుడుతో అనిత


బుల్లితెరపై సీరియల్స్ లో నటించి ఆ తర్వాత నువ్వు నేను సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయిన అనిత అలియాస్ నటాషా మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నది. శ్రీరామ్ , నిన్నే ఇష్టపడ్డాను వంటి సినిమాల్లో చేసిన సరైన హిట్స్ రాలేదు. తమిళ , తెలుగు, హిందీ బాషల్లో నటించిన నటాషా వ్యాపారవేత్త రోహిత్ ని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం స్టార్ ప్లస్ లో ప్రసారం అవుతున్న ఏ మేహబ్బత్ హాయ్ అనే హిందీ సీరియల్ లో కీలక పాత్రలో నటిస్తున్నది అనిత. కాగా బాలీవుడ్ లో అనిత కందలవీరుడి సరసన నటించే అవకాశం దక్కించుకుంది.

1983 లో జాకీష్రాఫ్, మీనాక్షి శేషాద్రి జంటగా నటించిన హీరో సినిమా ఇప్పుడు రీమేక్ అవ్వనున్నది. ఈ రీమేక్ ద్వారా ఆదిత్య పాంచొలి తనయుడు సూరజ్ , సునీల్ శెట్టి కుమార్తె అతియ వెండితెరకు పరిచయం కానున్నారు. ఈ సినిమాని సల్మాన్ ఖాన్ నిర్మిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అతని సరసన అనితని తీసుకున్నాడు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నది. సల్మాన్ సరసన నటించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇందులో తమంది చాలా మంచి పాత్రలని అనిత చెబుతుంది.
కండల విరుడుతో అనిత Reviewed by Unknown on 09:25 Rating: 5 బుల్లితెరపై సీరియల్స్ లో నటించి ఆ తర్వాత నువ్వు నేను సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయిన అనిత అలియాస్ నటాషా మొదటి సినిమాతోనే హిట్ అందుకున్...

No comments: