సహజీవనంపై ఉత్తరాది బ్యూటీ తాప్సీ సంచలన వ్యాఖ్యలు చేసింది.
పరిశ్రమలోని తారల్ని సహజీవనం చేయడం తప్పా? ఒప్పా? అని అడిగితె…. ఎవరి అభిప్రాయం వారది అంటూ మాట దాతెస్తారు. ఈనేపధ్యంలో ఇటీవల రూపొందిన ఓకే బంగారంలో నటించిన నిత్యామీనన్ కూడా ఇటువంటి సమాధానం చెప్పింది. ఇక ఆ సినిమా హీరో దుల్కర్ సల్మాన్ కూడా దాదాపు అటువంటి సమాధానమే ఇచ్చాడు. కానీ ఈ సినిమాతో ఎటువంటి సంబంధం లేని , సహజీవనం నేపధ్యంలో వచ్చిన సినిమాల్లో నటించని తాప్సీ మాత్రం ఎవరి అభిప్రాయం వారిది అని చెప్పలేదు.
సహజీవనం చేయడం తప్పుకాదని...ఎవరికీ ద్రోహం చేయకుండా సహజీవనం ఎంతో మేలని చెప్పింది. ఈ ఉత్తరాది బ్యూటీకి చాలా కాలం తర్వాత కోలీవుడ్‌లో కాంచన -2 చిత్రంతో సంతృప్తికరమైన సక్సెస్ వచ్చింది. బాలీవుడ్‌లో బేబి చిత్రం విజయం సాధించింది. రెట్టింపు సంతోషంతో ఉన్న తాప్సీ....పెళ్లి కాకుండా సహజీవనం చేయడం మేలే. వివాహం చేసుకుని ఆ తర్వాత విడాకులు తీసుకుంటే పిల్లలకు సమస్యలు తప్పవు. అదే సహజీవనంలో అయితే వారికి నచ్చకపోతే విడిపోవచ్చు. దీనివల్ల ఎవరికీ ఎలాంటి సమస్య ఉండదని చెప్పుకొచ్చింది తాప్సీ.


No comments: