ఎవ్వరు రేప్ చేసినా అది శిక్షార్హమేనని అనుకుంటున్నారా! కాని కాదట . భర్తలు రేప్ లు చేస్తే వాళ్ళకు ఎలాంటి శిక్ష పడదని సాక్షాత్తూ కేంధ్ర ప్రభుత్వమే సెలవిచ్చింది. భర్త బార్యను రేప్ చేసినా దాన్ని రేప్ కింద పరిగణించలేమని అలా చట్టాన్ని సవరించే యోచనకూడా లేదని కేంధ్రప్రభుత్వం స్పష్టం చేసింది.రాజ్య సభలో డీఎంకె ఎంపీ కనిమొళి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంధ్ర హోంశాఖ సహాయమంత్రి హరిభాయ్ చౌదరి ఈ విషయం చెప్పారు. మహిళలపై వివక్షను అంతమొందించేందుకు ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితి... భారత్ ఈ మేరకు చట్ట సవరణ చేయాలని, మారిటల్ రేప్‌ను నేరంగా చేయాలని సూచన చేసిన విషయం నిజమేనా అని కనిమొళి ప్రశ్నించింది. భర్త బలవంతంగా అనుభవించినా అది రేప్ కాదనే మినహాయింపు ఇచ్చిన ఐపిసిలోని 375 సెక్షన్ లోని రేప్ నిర్వచనాన్ని సవరించే బిల్లు తెస్తున్నారా అని ఆమె అడిగింది. దీనికి మంత్రి సమాధానమిస్తూ రేప్ సంబంధిత చట్టాలను సమీక్షించి 172వ నివేదిక సమర్పించినపుడు లా కమిషన్ కూడా భర్త బలాత్కారాన్ని నేరంగా పరిగణించాలని సిఫారసు చేయలేదని, సమాజంలో అక్షరాస్యత శాతం, పేదరికం, విభిన్నమైన సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, విలువలు, మతపరమైన విశ్వాసాలు ఉన్నాయని, ఇలాంటి సమాజంలో భర్త బలవంతాన్ని నేరంగా పరిగణించాలనే డిమాండ్‌ను అమలుచేయడం అంత సులభం కాదని అందువల్ల చట్టాన్ని సవరించే ప్రతిపాదనేమీ లేదని హరిభాయ్ చౌదరి స్పష్టం చేసారు. దీనిపై దేశ ప్రజలు ,మహిళా సంఘాల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.
Wednesday, 29 April 2015
భర్త రేప్ చేసినా అది రేప్ కాదు | కేంధ్ర ప్రభుత్వం
Reviewed by Unknown
on
22:30
Rating: 5
ఎవ్వరు రేప్ చేసినా అది శిక్షార్హమేనని అనుకుంటున్నారా! కాని కాదట . భర్తలు రేప్ లు చేస్తే వాళ్ళకు ఎలాంటి శిక్ష పడదని సాక్షాత్తూ కేంధ్ర ప్రభుత్...
Reviewed by Unknown
on
22:30
Rating: 5
ఎవ్వరు రేప్ చేసినా అది శిక్షార్హమేనని అనుకుంటున్నారా! కాని కాదట . భర్తలు రేప్ లు చేస్తే వాళ్ళకు ఎలాంటి శిక్ష పడదని సాక్షాత్తూ కేంధ్ర ప్రభుత్...
Related posts
Subscribe to:
Post Comments (Atom)


No comments: