ఆపరేషన్ సక్సెస్ … పేషెంట్ డెడ్ అన్న మాట చాలా సార్లు వినుంటారు. ఇప్పుడా పరిస్థితి దర్శకుడు పూరిజగన్ కు వచ్చిందట. ఆయన తీసిన టెంపర్ సినిమా సక్సెస్ నందుకుంది. హిట్ టాక్ ను సొంతం చేసుకోవటంతో దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. ఈ సినిమా తొలివారంలో రూ.34 కోట్లు వసూలుచేసిందని వార్తలు వచ్చాయి. అదిఎంత వరకు నిజమో కానీ .. దర్శకుడు పూరికి మాత్రం కోటి నష్టం మిగిలిందట. ఈ సినిమా వెస్ట్ గోదావరి ఏరియా హక్కులను రూ.2.5 కోట్లకు నిర్మాత బండ్ల గణేష్ నుంచి పూరి తీసుకున్నాడట. అయితే ఇప్పటివరకు ఈసినిమాకు వచ్చిన కలెక్షన్లు రూ.1.5కోట్లట. దీంతో పూరి కోటి రూపాయలునష్టపోయాడని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. టెంపర్ వల్ల దర్శకుడిగా పూరికి పేరొచ్చిందేమోగానీ, పంపిణీదారుడిగా కోటి రూపాయలు పోగొట్టుకొన్నాడని సెటైర్లు వేస్తున్నారట. ఇక ఎన్టీఆర్ కూడా నైజాం ఏరియా హక్కుల కింద సురేష్ బాబు నుంచి రూ.11 కోట్లు వసూలు చేశాడట. అయితే ఇప్పటివరకు రూ.10.5 కోట్లు రావడంతో మిగిలిన కోటిన్నర తిరిగి ఇచ్చేశాడట. ఈ లెక్కన టెంపర్ సక్సెస్ అటు పూరికి, ఎన్టీఆర్ కు కాసుల వర్షం కురిపించలేదని ఫిలింసర్కిల్లో సెటైర్లు వినిపిస్తున్నాయి.
Wednesday, 25 February 2015
టెంపర్ సక్సెస్ పూరికి, ఎన్టీఆర్ కు నష్టమేనట!
Reviewed by Unknown
on
03:10
Rating: 5
ఆపరేషన్ సక్సెస్ … పేషెంట్ డెడ్ అన్న మాట చాలా సార్లు వినుంటారు. ఇప్పుడా పరిస్థితి దర్శకుడు పూరిజగన్ కు వచ్చిందట. ఆయన తీసిన టెంపర్ సినిమా సక్స...
Reviewed by Unknown
on
03:10
Rating: 5
ఆపరేషన్ సక్సెస్ … పేషెంట్ డెడ్ అన్న మాట చాలా సార్లు వినుంటారు. ఇప్పుడా పరిస్థితి దర్శకుడు పూరిజగన్ కు వచ్చిందట. ఆయన తీసిన టెంపర్ సినిమా సక్స...
Related posts
Subscribe to:
Post Comments (Atom)


No comments: