శ్రీను వైట్లకు ఎవరి మీద కోపం వచ్చింది? - Telugu Its Telugu

728x90 AdSpace

Tuesday, 20 October 2015

శ్రీను వైట్లకు ఎవరి మీద కోపం వచ్చింది?

శ్రీను వైట్లకు ఎవరి మీద కోపం వచ్చింది?

గతంలో శ్రీను వైట్ల సినిమా అంటే చాలా క్రేజ్ ఉండటమే కాదు బాక్సాపీస్ వద్ద భారీ విజయాలను నమోదు చేసాయి. దాంతో అందరూ శ్రీను వైట్లను తెగ పోగిడేసారు. అయితే శ్రీనువైట్ల టీంలో ఉన్న గొడవలు ఒక్కసారిగా బాద్ షా సమయంలో బయటపడి విడిపోయారు. దాంతో శ్రీను వైట్ల ఒక్కడే 'ఆగడు' సినిమా తీసి ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్నాడు. ఆ తర్వాత రామ్ చరణ్ అవకాశం ఇచ్చాడు. దాంతో శ్రీను వైట్ల ప్లస్ ల గురించి స్టడి చేసిన మెగా కాంపౌండ్ మరల శ్రీను వైట్ల టీం ని కలిపింది. కోన వెంకట్, శ్రీను వైట్ల శత్రువులుగా ఉన్న వారు రామ్ చరణ్ సినిమాకి కలిసి పనిచేయాల్సిన అవసరం వచ్చింది. 'బ్రూస్ లీ' సినిమాకు కోన వెంకట్ టీం డైలాగ్స్, స్క్రీన్ ప్లే అన్నీ దగ్గర ఉండి చూసుకోవటమే కాకా చిరంజీవికి అదిరిపోయే డైలాగ్స్ కూడా రాసారట. శ్రీను వైట్ల కేవలం సినిమాకి డైరెక్టర్ మాత్రమే అని టాక్. అసలు పనిని కోనవెంకట్, గోపీమోహన్ లే చూసుకున్నారు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ శ్రీను వైట్లకు ఉపయోగపడదు. ఒకవేళ సినిమా హిట్ అయ్యిన ఆ క్రెడిట్ అంతా కోనవెంకట్ టీం కి వెళ్ళిపోతుంది. కాబట్టి శ్రీను వైట్ల కోనవెంకట్ అంటే చాలా కోపంగా ఉన్నాడట.
శ్రీను వైట్లకు ఎవరి మీద కోపం వచ్చింది? Reviewed by Unknown on 02:26 Rating: 5 గతంలో శ్రీను వైట్ల సినిమా అంటే చాలా క్రేజ్ ఉండటమే కాదు బాక్సాపీస్ వద్ద భారీ విజయాలను నమోదు చేసాయి. దాంతో అందరూ శ్రీను వైట్లను తెగ పోగిడేసారు...

No comments: