చరణ్ దంపతులకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన అమల - Telugu Its Telugu

728x90 AdSpace

Wednesday, 21 October 2015

చరణ్ దంపతులకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన అమల


'బ్రూస్ లీ', 'అఖిల్' సినిమాలు ఒక వారం వ్యవదిలో రావటంతో మెగా కుటుంబం,అక్కినేని కుటుంబం మధ్య వార్ జరుగుతుందని అనేక వార్తలు హాల్ చల్ చేసాయి. ఇటువంటి వార్తలకు చెక్ పెడుతూ అక్కినేని అమల ఒక ట్విస్ట్ ఇచ్చింది. అక్కినేని,మెగా కుటుంబాల మధ్య సాన్నిహిత్యాన్ని చూపుతూ చరణ్ దంపతులకు ఒక గిఫ్ట్ ఇచ్చింది. అసలు విషయంలోకి వెళ్ళితే అమల చరణ్ భార్య ఉపాసనకు ఒక ఒంటె పిల్లను గిఫ్ట్ గా ఇచ్చిందట. అమల బ్లూ క్రాస్ సొసైటీ ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలతో పాటు జంతు సంరక్షణ కూడా చూస్తుంది. ఒక సర్కస్ కంపెనీలో నిరాదరణకు గురి ఒంటె పిల్లను అమల చూడటంతో దాన్ని తీసుకువచ్చి ఉపాసనకు ఇచ్చింది. చరణ్ భార్య ఉపాసనకు కూడా అమల వలే జంతువుల పట్ల చాలా ప్రేమ ఉంది. అందుకే అమల ఇవ్వగానే చాలా ఆనందంతో ఒంటెను పెంచుతుంది. ‘బ్రూస్ లీ’ హడావిడిలో ఉన్నా చరణ్ కూడా ఈ ఒంటెను చూసి స్వాగతం పలికాడు. చరణ్ కి కూడా జంతువులంటే ప్రేమ అన్న విషయం మనకు తెలిసిందే.
చరణ్ దంపతులకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన అమల Reviewed by Unknown on 03:48 Rating: 5 'బ్రూస్ లీ', 'అఖిల్' సినిమాలు ఒక వారం వ్యవదిలో రావటంతో మెగా కుటుంబం,అక్కినేని కుటుంబం మధ్య వార్ జరుగుతుందని అనేక వార్తలు హాల...

No comments: