‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమా మెగా మేనల్లుడికి కలిసి వచ్చినా దర్శకుడు హరీష్ శంకర్ కి మాత్రం ఏమి కలిసి రాలేదని చెప్పవచ్చు. ‘గబ్బర్ సింగ్’ ఇచ్చిన భారీ విజయాన్ని కూడా ఉపయోగించుకోలేకపోయాడు. అలాగే ఇప్పుడు కూడా ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ ను కూడా ఉపయోగించుకోవటం రావటం లేదు. మెగా మేనల్లుడుతో హిట్ వచ్చింది కాబట్టి మెగా పవర్ స్టార్ '‘తని ఒరువన్’ సినిమా రీమేక్ అవకాశం ఇస్తాడని కొండత ఆశతో ఎదురు చూసాడు. 'కిక్ 2' పరాజయం అయినా సరే రామ్ చరణ్ సురేంద్ర రెడ్డికే ఓటు వేసాడు. హరీష్ శంకర్ మరో ప్రయత్నంగా రవితేజ తో ‘స్పెషల్ చబ్బీస్’ రీమేక్ చేద్దామని అడిగాడట. అయితే రవితేజ 'కిక్ 2' పరాజయంతో మొత్తం దృష్టిని 'బెంగాల్ టైగర్' మీదే పెట్టటం వలన ఈ సినిమా విడుదల అయ్యే వరకు ఏమి మాట్లాడానని చెప్పేసాడు. బోయపాటి శ్రీను సినిమా అయ్యాక కథ నచ్చితే హరీష్ శంకర్ తో సినిమా చేస్తానని బన్ని మాట ఇచ్చాడట. ఇన్ని అనుభవాలు అయ్యాక హరీష్ శంకర్ ఒక నిర్ణయానికి వచ్చేసాడట. బన్ని చేస్తే చేస్తాడు లేకపోతే తానే నిర్మాతగా మారి చిన్న హీరో,హీరోయిన్స్ సినిమా తీయాలని డిసైడ్ అయ్యాడు హరీష్.

No comments: