మా అన్నయ్యలు రామ్ చరణ్, వరుణ్ తేజ్ ఇద్దరికి నేను హీరోయిన్ గా వస్తున్న సంగతి తెలుసు అని నిహారిక అంటోంది. అయితే రామ్ చరణ్ మాత్రం ఆ విషయం తెలియదని అంటున్నాడు. దాంతో మెగా పవర్ స్టార్ మాటలకు అందరూ షాక్ అయ్యారు. మధుర శ్రీధర్ టివి9 చానల్ తో కలిసి నాగ సౌర్య హీరోగా 'ఒక మనస్సు' అనే సినిమాని తీస్తున్నారు. ఈ సినిమా ద్వారానే మెగా డాటర్ సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు. ఇప్పటివరకు మెగా కుటుంబం నుండి కేవలం హీరోలు మాత్రమే వచ్చారు. ఇలా ఒక హీరోయిన్ వస్తుందని అంటే కొంతమంది మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే కొంతమంది వస్తే ఏముందిలే అంటున్నారు. కాకపోతే రామ్ చరణ్ నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలీదు అనటం అనేది నిహారిక కెరీర్ మీద పడే అవకాశాలు ఉన్నాయి. మెగా హీరోల అండదండలు ఉంటేనే ఇమే కెరీర్ ఆశాజనకంగా ఉంటుందనేది వాస్తవం. మరి అన్నయ్య సపోర్ట్ దక్కించుకుంటుందో లేదో వేచి చూడాలి.

No comments: