మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘తనీ ఒరువన్’ రీమేక్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమాలో విలన్ ఎవరని దోబూచులాడింది. ఎట్టకేలకు విలన్ ని ఫిక్స్ చేసేసారు. ఒరిజినల్ సినిమాలో విలన్ గా నటించిన అరవింద్ స్వామినే ఎంపిక చేసేసారు. అయితే ఈ సినిమా తెలుగులో చేద్దామని అనుకున్నప్పుడు మొదట అరవింద్ స్వామినే అనుకున్నారు. కానీ అరవింద్ పెద్దగా ఆసక్తి కనబరచకపోవటంతో కొత్తగా ప్రయత్నిద్దామని రానా...నాగార్జున...రోహిత్...మాధవన్ పేర్లు బయటకు వచ్చి హాల్ చల్ చేసాయి. అయితే వీరిలో ఎవరిని కన్ఫర్మ్ చేయలేదు. ఈ పాత్రకు అరవింద్ స్వామి అయితేనే న్యాయం చేయగలదని భావించి మరల అతనినే ఎప్రోచ్ అయ్యారు. అరవింద్ స్వామికి భారీగా పారితోషికం ఆఫర్ చేయటంతో ఒప్పెసుకున్నాడని సమాచారం. పైకి మంచిగా ఉంటూ తెరవెనుక దారుణాలు చేసే కన్నింగ్ విలన్ గా సూపర్ గా నటించి విమర్శకుల ప్రశంసలను పొందటమే కాక సినిమాకే హైలెట్ గా మారటంతో తెలుగులో కూడా అదే చాన్స్ పట్టేసాడు.

No comments: