మరో ప్రయోగానికి సిద్దం అయ్యిన గౌతమ్ - Telugu Its Telugu

728x90 AdSpace

Tuesday, 20 October 2015

మరో ప్రయోగానికి సిద్దం అయ్యిన గౌతమ్

మరో ప్రయోగానికి సిద్దం అయ్యిన గౌతమ్

తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ ద్వి బాష సినిమాలను తీయటంలో నేర్పరి అని మనకు తెలుసు. మొన్న ఆ మధ్య ‘ఏమాయ చేశావే’ సినిమాను తెలుగులో నాగ చైతన్య,తమిళంలో శింబు తో తీసి సూపర్ విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు కూడా అదే విధంగా ‘సాహసం స్వాసగా సాగిపో’ అనే సినిమాని సేమ్ హీరోలతో తెలుగు,తమిళ బాషలలో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్దం అయ్యాడు. నాలుగు బాషల్లోని నలుగురు హీరోలతో ఒకేసారి ఒక సినిమా తీయటానికి ప్రణాళికను సిద్దం చేసుకుంటున్నాడు. అయితే హీరోలను కూడా సెట్ చేసేసుకున్నాడు. తెలుగు నుండి అల్లు అర్జున్‌, తమిళం నుండి శింబు, కన్నడం నుండి పునీత్‌ రాజ్‌ కుమార్‌, మలయాళం నుండి పహాద్‌ ఫాజిల్‌లను హీరోలుగా ఎంపిక చేసుకొని, వారి దగ్గర నుండి డేట్స్ కూడా తీసుకున్నట్టు సమాచారం. ఈ సినిమా కథ విషయానికి వస్తే నలుగులు ట్రావెల్ ఫ్రెండ్స్ జీవితంలో జరిగిన ఆసక్తికరమైన సన్నివేశాల సమాహారమే అని కోలీవుడ్ కథనం. ఈ విధంగా నలుగురు స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటిస్తే ప్రేక్షకులకు ఆనందమే ఆనందం.
మరో ప్రయోగానికి సిద్దం అయ్యిన గౌతమ్ Reviewed by Unknown on 02:15 Rating: 5 తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ ద్వి బాష సినిమాలను తీయటంలో నేర్పరి అని మనకు తెలుసు. మొన్న ఆ మధ్య ‘ఏమాయ చేశావే’ సినిమాను తెలుగులో నాగ చైతన్య,తమిళంల...

No comments: