ప్రతి మహిళకి గర్భం ధరించటం అనేది ఒక అనిర్వచనీయమైన అనుభూతి. అయితే
కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండటమే కాకా గర్భంలో ఉన్న
పిండం కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది.
* గర్భవతులు తమ ఆహారంలో వీలు ఉన్నంత వరకు తాజా పండ్లు,ఆకుకూరలు,పచ్చని
కూరగాయలు తీసుకోవాలి.
* కాఫీ,టీ లను త్రాగకుండా ఉంటే మంచిది. వీటిల్లో ఉండే కెఫీన్ గర్భస్థ
శిశువుకు హాని చేస్తాయి.
* డాక్టర్ సలహా లేకుండా ఎటువంటి మందులను వాడకూడదు.
* ఎక్కువసేపు నిల్చుని ఉండకూడదు. అలాగే ఎక్కువసేపు కాళ్ళు ముడుచుకొని
కూర్చోవటం కూడా మంచిది కాదు.
* పడుకొనే సమయంలో ఎడమ వైపుకు తిరిగి పడుకోవాలి. దీని వల్ల గర్భంలోని
శిశువుకు తగినంత ఆక్సిజన్ అందుతుంది.
* రాత్రి సమయంలో తప్పనిసరిగా ఎనిమిది గంటల నిద్ర అవసరం.
* నీరు ఎక్కువగా త్రాగాలి. దీని వల్ల మలబద్దకం, యూరినరీ బ్లాడర్ లో వచ్చే
ఇన్ ఫెక్షన్స్ దరి చేరవు.
* వాకింగ్ చేసేటప్పుడు వేగంగా నడవకూడదు.
* గర్భవతులు తమ సాదారణ దినచర్యలో ఎటువంటి మార్పులను చేసుకోవలసిన అవసరం లేదు.


No comments: