ఇది సాదారణంగా స్త్రీలలో వచ్చే సమస్య. దీని వల్ల కళ్ళు అలసటగా
ఉండటం,డిప్రెషన్ కి లోనయినట్టు, ముసలితనం వచ్చినట్టు అన్పిస్తుంది. కానీ
ఇలా రావటానికి కారణాలు మాత్రం చాలా చిన్నవి. వేళకు సరైన నిద్ర
లేకపోవటం,సమస్యలు,ఒత్తిడి,వంశపారంపర్యం వంటివి కారణాలుగా చెప్పవచ్చు.
కొన్ని చిన్న చిన్న చిట్కాల ద్వారా ఈ సమస్యను అధికమించవచ్చు.
* బాదాం ఆయిల్ ని క్రమం తప్పకుండా ప్రతి రోజు కళ్ళ చుట్టూ రాస్తూ ఉంటే
క్రమంగా నల్లటి వలయాలు తగ్గి చర్మం మృదువుగా తయారవుతుంది.
* మెంతులు నానబెట్టి ముద్దగా చేసుకొని పాలతో కలిపి కళ్ళ చుట్టూ పట్టిస్తే
నలుపు పోయి కళ్ళు ప్రకాశవంతంగా మారతాయి.
* బంగాళదుంప రసాన్ని దూదితో కళ్ళ చుట్టూ రాయటం వలన కళ్ళ చుట్టూ నలుపు
పోవటమే కాకా మృదువుగా మారతాయి.
* కీరా దోస ను చక్రాల్లా కోసి ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లగా అయిన తర్వాత
కంటి మీద పెట్టుకొని పది నిముషాలు ఉంటే కళ్ళ కింద నలుపు పోవటమే కాకా కళ్ళ
బరువు కూడా తగ్గుతుంది.


No comments: