చెన్నై మెగా ఫ్యాన్స్‌ పైర్....ఎందుకు? - Telugu Its Telugu

728x90 AdSpace

Saturday, 10 October 2015

చెన్నై మెగా ఫ్యాన్స్‌ పైర్....ఎందుకు?


మెగా పవర్ స్టార్  నటిస్తున్న 'బ్రూస్ లీ' సినిమా విడుదలకు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తమిళంలో కూడా భారీగా విడుదల చేద్దామనే ఉద్దేశంతో ఉన్నారు. దాంతో ఆడియో వేడుకను భారీగా చేయాలని అనుకున్నారు. అంతేకాక తమిళంలో ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నారు. చెన్నై లో జరిగే ఆడియో వేడుకకు మొత్తం చిత్ర యూనిట్ అంతా వస్తుందని ప్రకటించారు. అయితే ఆ ఆడియో వేడుకకు చరణ్ తప్పించి మిగతా చిత్ర యూనిట్ అంతా హాజరు అయ్యారట. మెగా అభిమానులు చరణ్ వస్తాడని ఎంతగానో ఎదురు చూసారు.

 కానీ చరణ్ రాలేదు. చరణ్ రాకపోవటానికి ఫ్లైట్‌ మిస్‌ అయ్యిందని చెప్పారట. దాంతో మెగా అభిమానులు చరణ్ మీద తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారట. అంతేకాక అభిమానులు ఒక ఎయిర్‌ వేస్‌కు ఓనర్‌గా ఉండి కూడా ఫ్లైట్ మిస్ అయ్యిందని చెప్పటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. ఈ వేడుకకు హీరో రాకపోయినా హీరోయిన్ రకుల్ వచ్చి వేడుకకు కలరింగ్ తెచ్చి పెట్టింది. అయితే చరణ్ డుమ్మా  కొట్టటానికి గల కారణాలు తెలియరాలేదు.
చెన్నై మెగా ఫ్యాన్స్‌ పైర్....ఎందుకు? Reviewed by Unknown on 20:05 Rating: 5 మెగా పవర్ స్టార్  నటిస్తున్న 'బ్రూస్ లీ' సినిమా విడుదలకు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తమిళంలో కూడా భారీగా విడుదల చేద్ద...

No comments: