ప్రస్తుతం సినీ రంగం కొత్త టెక్నాలజీని అంది పుచ్చుకొని బాగా ఉపయోగించుకొని కొత్త కొత్త ప్రయోగాలను చేయటంలో ముందుంటుంది . ఇప్పటివరకు మొబైల్ యాప్స్ అనేవి సినిమా పాటలు... ట్రైలర్స్ కోసం చూసాం. ఇప్పుడు ఏకంగా రామ్ చరణ్ తన పేరుతో ఒక మొబైల్ యాప్ ని ప్రారంభించాడు. ఈ విధంగా ఒక హీరో పేరుతో మొబైల్ యాప్ తయారుకావటం ఇదే మొదటిసారి. ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు తన సినిమాలకు సంబందించిన సమాచారం చెప్పుతూ అభిమానులకు దగ్గర అవ్వాలని ఈ విధమైన ప్లాన్ చేసాడు మెగా పవర్ స్టార్.
ఈ యాప్ ని యాపిల్ స్టోర్ – గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ని కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ డిజైన్ చేసింది. చిరు 150 వ సినిమాను కూడా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే చరణ్ నిర్మిస్తున్నాడు. ఈ యాప్ లో చరణ్ పాత సినిమా పాటలతో పాటు,లేటెస్ట్ సినిమా అప్ డేట్స్ కూడా ఉండటంతో యువత ఈ యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవటానికి ఎగపడతారని చెప్పవచ్చు. ఈ యాప్ ని పరిచయం చేయటానికి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోని నా టీం డిజైన్ చేసింది. మీరు యాప్ డౌన్ లోడ్ చేసుకోగానే అది ప్రత్యక్షం అవుతుందని చరణ్ అభిమానులకు ఫేస్ బుక్ ద్వారా చెప్పాడు.


No comments: