టాలీవుడ్ లో రీమేక్ సినిమాలకు ఆమడ దూరంలో ఉండే దిల్ రాజు చూపు ప్రస్తుతం బాలీవుడ్ సినిమా మీద పడింది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన 'స్పెషల్ చబ్బీస్' మీద పడినట్టు సమాచారం. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేద్దామనే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రస్తుతం దిల్ రాజు ఏమి పట్టుకున్నా బంగారం
అయ్యిపోతుంది. ఈ సినిమాని మాస్ మహారాజ్ రవితేజతో చేద్దామనే నిర్ణయంతో ఉన్నాడు. గతంలో దిల్ రాజు,రవితేజ కంబోలో 'భద్ర' సినిమా వచ్చింది.
అయితే ఈ రీమేక్ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తాడని సమాచారం. హరీష్ శంకర్,రవితేజ కాంబినేషన్ లో షాక్,మిరపకాయ సినిమాలు వచ్చాయి. 'షాక్' సినిమా కొంత నిరుత్సాహానికి గురి చేసిన 'మిరపకాయ' హిట్ కావటంతో హరీష్ శంకర్ కి 'గబ్బర్ సింగ్' సినిమా అవకాశం రావటం అది తన కెరీర్ లోనే బెగ్గేస్ట్ హిట్ గా నిలవటం జరిగిపోయింది . ఇప్పుడు మరల ఆ కాంబో రిపీట్ అవుతుంది. ప్రస్తుతం హరీష్ శంకర్ రవితేజ ఇమేజ్ కి తగ్గట్టుగా 'స్పెషల్ చబ్బీస్' సినిమాలో మార్పులు చేసే పనిలో పడ్డాడట.


No comments: