బాలీవుడ్ లో తన సినిమాలు వంద కోట్ల మార్క్ ని అవలీలగా దాటే సల్మాన్...బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో లో సందడి చేయటానికి రెడీ అయిపోయాడు. ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సల్మాన్ ఈ కార్యక్రమాన్ని కూడా బాగానే ప్రమోట్ చేస్తున్నాడు. బిగ్ బాస్ షో కి సల్మాన్ గతంలో కన్నా ఎక్కువగా ఒక్కో ఎపిసోడ్ కు 5 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నాడని బాలీవుడ్ లో గుసగుసలు విన్పిస్తున్నాయి.
కండల వీరుని దగ్గర కొంతమంది ఈ షోకి ఎంత పారితోషికం తీసుకుంటున్నారని అడిగితే కాస్త పైర్ అయ్యి మీకు అవసరమా అని అడిగాడట. అంతేకాక బిగ్ బాస్ రియాల్టీ షో కి ఎంత పారితోషికం తీసుకున్నా సరే ఆ మొత్తం ఛారిటీ సంస్థ బీయింగ్ హ్యూమన్ కే వెళ్ళిపోతుందని కూడా తెలిపాడు. ఏది ఏమైనా ఇంత పెద్ద మొత్తాన్ని ఒక చారిటీ సంస్థకు ఇచ్చే పెద్ద మనస్సు సల్మాన్ కి ఉండటం చాలా గొప్ప విషయం. మిగతా స్టార్ హీరోలు కూడా సల్మాన్ ని ఫాలో అయితే బాగుంటుంది.


No comments: