పవన్ కళ్యాణ్ ' గోపాలా గోపాలా' సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు వెంకటేష్. అయితే ఈ సినిమాలు ప్రారంభం కావటానికి కొంత సమయం ఉండటంతో ఆ గ్యాప్ లో మేనల్లుడు సినిమాలో నటించటానికి రెడీ అయ్యాడు. ఇటీవల మలయాళంలో సూపర్ హిట్ అయిన 'ప్రేమమ్' సినిమాని తెలుగులో నాగ చైతన్య రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో వెంకీ నటిస్తున్నాడు. తన మేనల్లుడు నాగ చైతన్య స్వయంగా వెంకీని అడగటంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. మలయాళం వెర్షన్ లో ప్రముఖ నటుడు అనంత్ నాగ్ పోషించిన పాత్రను తెలుగులో వెంకటేష్ పోషిస్తున్నాడు. తెలుగులో మల్టీస్టారర్ సినిమాలకు వెంకీ ఎప్పుడూ ముందే ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ లతో స్క్రీన్ షేర్ చేసుకున్న వెంకీ ఇప్పుడు మేనల్లుడుతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. చైతూ శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, అమైరా దస్తూర్ తో రోమాన్స్ చేస్తున్న ఈ సినిమాకి 'మజ్ను' అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు.


No comments: