ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హీరో గా వెలుగొందిన ఎన్టీఆర్ , వచ్చే సినిమా తో సౌత్ ఇండియా ని షేక్ చేసే అవకాశం ఉంది. వివరాల్లోకి వెళితే , ప్రస్తుతానికి ఎన్టీఆర్ , జనత గ్యారేజ్ సినిమా పనుల్లో బిజీ గా ఉన్నాడు;. వచ్చే నెల మొదటి వారం నుండి ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొంటాడు.
అయితే , ఎన్టీఆర్ ఈ సినిమా తో సౌత్ ఇండియా ఫేమస్ అవుతాడని ట్రేడ్ పండితులు లెక్కలు కడుతున్నారు. మోహన్ లాల్ జనత గ్యారేజ్ లో ఉండటం వాళ్ళ మలయాళం , తమిళ్ మార్కెట్ లో సినిమా కి మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పటికే కేరళ రైట్స్ దాదాపు 4.5 కోట్లకు అమ్ముడు పోవడం విశేషం. ఇక కర్ణాటక లో ఎలాగో ఎన్టీఆర్ కి క్రేజ్ ఉంది కాబట్టి , జనత గ్యారేజ్ సినిమా తో ఎన్టీఆర్ సౌత్ ఇండియా షేక్ చేస్తాడని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోహన్ లాల్ కి తమిళనాడు లో మంచి క్రేజ్ ఉంది, ఈ మధ్యనే విజయ్ తో చేసిన జిల్లా సినిమా పెద్ద హిట్ గా నిలిచింది . ఈ సమీకరణలు అన్ని చూస్తుంటే ఎన్టీఆర్ సౌత్ ఇండియా ని షేక్ చేస్తాడు అనడం లో ఎటువంటి సందేహం లేదు.


No comments: