అదిరిపోయిన ప్రేమం ఫస్ట్ లుక్ - Telugu Its Telugu

728x90 AdSpace

Friday, 19 February 2016

అదిరిపోయిన ప్రేమం ఫస్ట్ లుక్

అదిరిపోయిన ప్రేమం ఫస్ట్ లుక్


నాగ చైతన్య ప్రెమమ్ రీమేక్ ఫస్ట్ లుక్ ఈరోజు విడుదల అయ్యింది. తెలుగు వెర్షన్ కి కూడా అదే టైటిల్ పెట్టడం విశేషం. మలయాళం వెర్షన్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా నాగ చైతన్య ఫస్ట్ లుక్ ఉండటం విశేషం.. కేరళ , తమిళనాడు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు తెలుగు లో కూడా అదే టైటిల్ తో రానుంది.


తొలుత సినిమా కి " మజ్ను " అనే టైటిల్ అనుకున్నారు కాని ప్రేమం అయితేనే జనాలకు బాగా చేరువ అవుతుందని నిర్మాతలు భావించారు. అనుపమ్ , శ్రుతి హసన్ , మడోన్నా హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమా కి కార్తికేయ ఫేం చందు దర్శకుడు.నిర్మాతలు ఈ ఏడాది జూన్ లేకపోతే జూలై లో సినిమా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.ప్రస్తుతానికి గోవా లో చిత్రీకరణ జరుపుకుంటుంది. నాగ చైతన్య కెరీర్ లో ప్రేమం సినిమా ఇంకో కల్ట్ క్లాసిక్ అయ్యేలా ఉందని అభిమానులు ఆనందపడుతున్నారు. ఇప్పటికే సోగ్గాడు సినిమా విజయం తో అక్కినేని ఫాన్స్ సంతోషాల్లో ఉన్నారు , ఇప్పుడు ప్రేమం ఫస్ట్ లుక్ వాళ్ళకి అదనపు సంతోషాన్ని చేర్చింది. నాగ చైతన్య " సాహసం స్వాశాగా సాగిపూ " సినిమా కూడా ఈ ఏడాది విడుదల కావాల్సి ఉంది.
అదిరిపోయిన ప్రేమం ఫస్ట్ లుక్ Reviewed by Unknown on 10:25 Rating: 5 నాగ చైతన్య ప్రెమమ్ రీమేక్ ఫస్ట్ లుక్ ఈరోజు విడుదల అయ్యింది. తెలుగు వెర్షన్ కి కూడా అదే టైటిల్ పెట్టడం విశేషం. మలయాళం వెర్షన్ కి ఏ మాత్...

No comments: