కెరీర్ లో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నాగ చైతన్య మళ్ళి మాస్ సినిమాల వైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. దోచేయ్ సినిమా ఫ్లాప్ తర్వాత వరుసాగా క్లాసు సినిమాలు చేస్తున్న నాగ చైతన్య , మళ్ళి మాస్ సినిమాలు చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే ప్రెమమ్ సినిమా 70 % షూటింగ్ పూర్తి చేసుకుంది, ఈ సినిమా తర్వాత గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉంది.
గబ్బర్ సింగ్ తర్వాత రామయ్య వస్తావయ్య లాంటి పెద్ద ఫ్లాప్ ఇచ్చిన హరీష్ శంకర్ , వెంటనే సాయి ధరమ్ తేజ్ తో సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ తీసి మంచి విజయాన్ని సాధించాడు. అయిన సరే హరీష్ తో సినిమా చెయ్యడానికి పెద్ద హీరోలు ముందుకు రాకపోవడం తో నాగ చైతన్య లాంటి ఫ్యూచర్ స్టార్ తో సినిమా చేస్తే బాగుంటుందని హరీష్ ఆలోచన. ఈ మధ్యనే మంచి లైన్ తో తో నాగ చైతన్య దగ్గరికి వెళ్ళాడట , చైతు కూడా హరీష్ లైన్ ని ఓకే చేసాడని సమాచారం. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టలేక్కుతుందో చూడాలి.


No comments: