50 కోట్ల టార్గెట్ పెట్టుకున్న చిరు - Telugu Its Telugu

728x90 AdSpace

Friday, 19 February 2016

50 కోట్ల టార్గెట్ పెట్టుకున్న చిరు

50 కోట్ల టార్గెట్ పెట్టుకున్న చిరు


దాదాపు 9 ఏళ్ళ నుండి తెర మీద కనపడని మెగా స్టార్ చిరంజీవి ఈ ఏడాది తన 150 వ సినిమా తో మన ముందుకు రానున్నాడు. చిరు సినిమాలు మానేసే సమయానికి చిరు హైయెస్ట్ రెవిన్యూ 28 కోట్లు ఉండేది. ఇప్పుడు మార్కెట్ పెరిగింది , కుర్ర హీరోలకు ఎక్కువ రెవిన్యూ రావడం మొదలయ్యింది.

బాలయ్య లాంటి మాస్ హీరో కస్టపడి 30 కోట్లు , 40 కోట్లు కొడుతున్నారంటే పరిస్థతి అర్ధం చేసుకోవొచ్చు. అయితే , ఈ మధ్యలోనే నాగార్జున మనం , సోగ్గాడే చిన్ని నాయన సినిమాలతో 40 , 45 కోట్ల మార్క్ ని అవలీల గా అందుకున్నాడు.ఇప్పుడు చిరు మళ్ళి సినిమాల్లోకి వస్తే , మినిమం ఎంత చెయ్యాలి అనే విషయం మీద ఫాన్స్ లో చర్చ మొదలయ్యింది. చాల మంది ఫాన్స్ లెక్కల ప్రకారం , చిరు తన 150 సినిమా తో కనీసం 50 కోట్లు అయిన చెయ్యాలని అంటున్నారు. ఇప్పుడున్న మార్కెట్ వేల్యూ ప్రకారం చూస్తే , చిరు కి 50 కోట్ల మార్క్ పెద్ద విషయం ఎం కాదు. కానీ బ్రూస్ లీ ఓపెనింగ్స్ చూసాక చిరు స్టామిన మీద ట్రేడ్ పండితుల అంచనాలు తల కిందులు అయ్యాయి. ఏది ఏమైనా చిరు మొదటి టార్గెట్ మాత్రం 50 కోట్లు అని తేలిపోయింది. మరి చిరు తన టార్గెట్ ని అందుకోవాలని కోరుకుందాం.
50 కోట్ల టార్గెట్ పెట్టుకున్న చిరు Reviewed by Unknown on 10:17 Rating: 5 దాదాపు 9 ఏళ్ళ నుండి తెర మీద కనపడని మెగా స్టార్ చిరంజీవి ఈ ఏడాది తన 150 వ సినిమా తో మన ముందుకు రానున్నాడు. చిరు సినిమాలు మానేసే సమయానిక...

No comments: