అదేంటి పవన్ కి చరణ్ పంచ్ ఇవ్వడం ఏంటి అని ఆలోచిస్తున్నారా ? వివరాల్లోకి వెళితే , పవన్ కళ్యాణ్ పోయిన ఏడాది , పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే బ్యానర్ ని స్థాపించాడు. ఈ బ్యానర్ లో మొదటి సినిమా రామ్ చరణ్ తో చేస్తానని ప్రకటించడం విశేషం. బ్రూస్ లీ ది ఫైటర్ సినిమా సమయం లో పవన్ , చిరు , రామ్ చరణ్ ఒక దగ్గరకి చేరినపుడు కూడా ఇదే ప్రస్తావించారు.
ఆ తర్వాత చరణ్ రెగ్యులర్ గా బాబాయ్ షూటింగ్ స్పాట్ కి వెళ్లి కలవడం కూడా జరిగింది. రామ్ చరణ్ - పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ మూవీ ఫిక్స్ అయ్యింది అని కూడా వదంతులు వచ్చాయి. ఇవన్ని పక్కన పెడితే , అస్సలు ఈ సినిమా డిస్కషన్ అంతకు మించి ముందుకు పోలేదని చాల మంది అన్నారు. తాజాగా రామ్ చరణ్ మూడు సినిమాలు చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మూడు సినిమాల లిస్టు లో పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడం గమనార్హం. అంటే రామ్ చరణ్ వచ్చే ఏడాది వరకు ఖాళీ ఉండడు. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ చరణ్ కి హ్యాండ్ ఇచ్చాడని తెలుస్తుంది. ప్రస్తుతానికి పవన్ తీరికలేని బిజీ గా ఉన్నాడని సన్నిహితులు కూడా చెప్పడం బలం చేకూరుస్తుంది.


No comments: