దిల్ రాజు సినిమాలంటే మార్కెట్ లో కొంచెం క్రేజ్ ఉంటుంది , ఇక దిల్ రాజు చేసే ఫ్యామిలి సినిమాలు గురించి ఎంత చేపుకున్న తక్కువే. అయితే , ఈ మధ్య దిల్ రాజు చాల వరకు రొటీన్ సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్యనే విడుదల అయిన సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ , కేరింత లాంటి సినిమాలు జనాలని అనుకున్నంత ఆకర్షించలేదు.
పోయిన ఏడాది విడుదల కు సిద్ధం అయిన కృష్ణాష్టమి , ఈరోజు విడుదల చేసాడు దిల్ రాజు. విడుదల కి ముందు , ఈ సినిమా గురించి చాల బీరాలు పలికాడు దిల్ రాజు. ఈ సినిమా ఖచ్చితంగా 70 శాతం మందికి నచ్చుతుందని , నేను ఈ సినిమాకి 3.25 - 3.50 రేటింగ్ ఇస్తా అని పబ్లిక్ గా చెప్పడం విశేషం. ఇలాంటి భారి అంచనాల నడుమ వచ్చిన కృష్ణాష్టమి బాక్స్ ఆఫీసు దగ్గర భారి గా బోల్తా పడింది. గత 10 ఏళ్ళుగా వచ్చిన అన్ని సినిమాలను కలిపి కృష్ణాష్టమి అని ప్రేక్షకులు తేల్చి పడేసారు. మార్నింగ్ షౌస్ నుండి చెత్త టాక్ సొంతం చేసుకున్న కృష్ణాష్టమి సునీల్ కెరీర్ లోనే పెద్ద ఫ్లాప్ గా నిలిచే అవకాశం ఉంది. మొత్తానికి దిల్ రాజు కి ప్రేక్షకులు పెద్ద ఝలక్ ఇచ్చారు.


No comments: