మెగా ఫాన్స్ కి ఇది నిజంగా పెద్ద విషయమే అని చెప్పాలి. గత కొన్ని ఏళ్ళుగా చిరు ఫ్యామిలి లో చిన్నపాటి విబేధాలు కనిపించాయి. నాగ బాబు అంతటి వాడు కూడా కోపాన్ని అదుపులో పెట్టుకోలేక అరిచాడంటే పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవొచ్చు. ఇలాంటి సందర్భం లోనే అన్నయ్య పుర్రిన రోజు కి పవన్ కళ్యాణ్ హాజరు అయ్యాడు. మెగా ఫ్యాన్స్ ని నిరాశ పరచడం ఇస్తంలేకనే పవన్ కళ్యాణ్ వచ్చాడు అని చాల మంది అనుకున్నారు.
ఇప్పుడు ఇవన్ని పక్కన పెడితే , మళ్ళి మెగా హీరోలంత ఒక దగ్గరకు చేరే అవకశం ఉంది అంటున్నారు ఫిలిం నగర్ వర్గాలు. వివరాల్లోకి వెళితే , సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్ ని వచ్చే నెల హైదరాబాద్ లో విడుదల చేద్దాం అని అనుకున్నారు కాని , తాజా సమాచారం ప్రకారం సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్ అమరావతి లో చేద్దాం అని ఫిక్స్ అయ్యారట. ఈ ఆడియో విడుదలకు చిరంజీవి , నాగ బాబు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. అమరావతి లో ఆడియో కోసం ఇప్పటికే పవన్ కళ్యాణ్ బృందం , ఒకసారి రాజధాని ప్రాంతం అంత తిరిగి సమీక్షిస్తున్నారు. ఇంతకు ముందు ఇక్కడే డిక్టేటర్ ఆడియో విడుదల కూడా జరిగింది. ఏది ఏమైనా మెగా ఫాన్స్ కి మాత్రం ఇది శుభ వార్త అని చెప్పాలి. మరి ఈ విషయం మీద క్లారిటీ ఎప్పుడు వస్తాడో చూడాలి.


No comments: