తెలుగు సినిమా లో దావూద్ ఇబ్రహీం నటిస్తున్నడా ? అని షాక్ అవ్వకండి. పూర్తిగా వివరాల విన్నాక మీకు అస్సలు విషయం తెలుస్తుంది. విలక్షణ నటుడు నారా రోహిత్ ఒక సరి కొత్త సినిమా కి తెర లేపనున్నాడు.అయ్యారే తో మంచి మార్కులు కొట్టేసిన సాగర్ చంద్ర దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా 80 లో జరిగిన ఒక యదార్ధ గాధ ఆధారంగా తీస్తున్నారు.
కథ ప్రకారం దావూద్ ఇబ్రహీం పాత్ర కూడా ఉంటుందట , ప్రస్తుతానికి దావూద్ ఇబ్రహీం లాగ కనిపించే వ్యక్తి కోసం అన్వేస్తున్నాడని సమాచారం. ఈ సినిమా కి " అప్పట్లో ఒకడుండేవాడు " అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఇంకో వైపు నారా రోహిత్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నాడు. ఇప్పటికే చాల సినిమాలు షూటింగ్ చివర దశకు చేరుకున్నాయి.మరి ఈ సినిమా ని ఎప్పుడు మొదలుపెడతాడో చూడాలి.అయ్యారే సినిమా చాల మంది విమర్శకుల అభినందలను పొందింది, ఈ సినిమా కూడా నారా రోహిత్ కెరీర్ కి సహాయపడుతుందని అంచనా వేస్తున్నారు పరిశీలకులు.


No comments: