అయోమయం లో బెల్లంకొండ - Telugu Its Telugu

728x90 AdSpace

Friday, 19 February 2016

అయోమయం లో బెల్లంకొండ

అయోమయం లో బెల్లంకొండ


టాలీవుడ్ లో అగ్ర నిర్మాతల్లో ఒకడు బెల్లం కొండ సురేష్ ఒకరు. ఒకప్పుడు బాలయ్య తో సూపర్ హిట్లు కొట్టిన బెల్లంకొండ సురేష్ ఆ తర్వాత చిన్న చిన్న సినిమాలను నిర్మించాడు. ఇవన్ని పక్కన పెడితే , బెల్లంకొండ తన కొడుకు ని పరిచయం చేసినప్పటి నుండి కష్టల్లోనే ఉన్నాడు. అల్లుడు శీను, రభస సినిమాలను ఒకేసారి నిర్మించి చేతులు కాల్చుకున్నాడు.

ఆ తర్వాత బోయపాటి తో కొడుకు సినిమా అని ప్రకటించి డబ్బులు లేక ఆపేసాడు. అయితే , తన కుమారుడి రెండవ సినిమా అయిన " స్పీడున్నోడు " కి వెనకాల నుండి బెల్లంకొండనే డబ్బులు పెట్టాడు అనే వాదన గట్టిగా వినిపిస్తుంది.ఈ సినిమా కూడా బిజినెస్ తక్కువే అవ్వడం , బాక్స్ ఆఫీసు దగ్గర ఫ్లాప్ అవ్వడంతో బెల్లంకొండ అయోమయం లో పడ్డాడు. ఇంకో వైపు యువ డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామ బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమాకు ఒప్పుకున్నాడు కాని స్పీడున్నోడు పరాజయం తో అభిషేక్ బెల్లంకొండ కి హ్యాండ్ ఇచ్చే సూచనలు ఉన్నాయని తెలుస్తుంది. బాలయ్య తన 100 వ సినిమాకి బోయపాటి కావాలి అని పట్టుబట్టడం , అప్పులు ఇలా బెల్లం కొండ సురేష్ చాల కష్టాల్లో ఉన్నాడని ఫిల్మ్ నగర్ సమాచారం.
అయోమయం లో బెల్లంకొండ Reviewed by Unknown on 09:19 Rating: 5 టాలీవుడ్ లో అగ్ర నిర్మాతల్లో ఒకడు బెల్లం కొండ సురేష్ ఒకరు. ఒకప్పుడు బాలయ్య తో సూపర్ హిట్లు కొట్టిన బెల్లంకొండ సురేష్ ఆ తర్వాత చిన్న చి...

No comments: