మెగా హీరోల మధ్యలో చిచ్చు ? - Telugu Its Telugu

728x90 AdSpace

Friday, 19 February 2016

మెగా హీరోల మధ్యలో చిచ్చు ?

మెగా హీరోల మధ్యలో చిచ్చు ?


మెగా ఫ్యామిలి లో హీరో లు ఎక్కువ అయిపోయారు. రామ్ చరణ్ తర్వాత సాయి ధరమ్ తేజ్ , వరుణ్ తేజ్ , అల్లు శిరీష్ హీరోలుగా తెర మీద కనిపించారు. అయితే , ఈ ముగ్గురి హీరోలలో సాయి ధరమ్ తేజ్ దూసుకుపోతున్న విషయం మనకు తెలిసిందే. వరుణ్ తేజ్ తో పోలిస్తే సాయి ధరమ్ తేజ్ మార్కెట్ డబుల్ ఉందని చెప్పాలి. పిల్ల నువ్వు లేని జీవితం , సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ సినిమాలు బాగా ఆడటం తో పాటు సాయి ధరమ్ తేజ్ కి మంచి మార్కెట్ ని తెచ్చి పెట్టింది , ఇంకో వైపు వరుణ్ చేసే సినిమాలు జనాలకి నచ్చుతన్నాయి కాని ఒక మాస్ హీరో గా ఎదగడానికి పనికిరావట్లేదు.

కంచె , లోఫర్ సినిమాలలో వరుణ్ తేజ్ నటన కి మంచి పేరు వచ్చింది కాని సినిమాలు మాత్రం అనుకోని రీతి లో యావరేజ్ గా నిలిచాయి. ఐహె , తాజాగా వరుణ్ తేజ్ వదిలేసినా సినిమా " రాయ భారి" , ఈ సినిమా బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశం తో వదిలేసారు కాని ఇదే కథ ని సాయి ధరమ్ తేజ్ తో చెయ్యడానికి ఒక నిర్మాత ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇదే నిజం అయితే , ఇద్దరి మధ్యలో చిచ్చు పెడుతున్నారు అనేది నిజం. ఒకే కాంపౌండ్ లో ఉన్న హీరోల మధ్యలో ఇలాంటి గొడవలు పెట్టడం అంత మంచిది కాదేమో అని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నారు.
మెగా హీరోల మధ్యలో చిచ్చు ? Reviewed by Unknown on 09:22 Rating: 5 మెగా ఫ్యామిలి లో హీరో లు ఎక్కువ అయిపోయారు. రామ్ చరణ్ తర్వాత సాయి ధరమ్ తేజ్ , వరుణ్ తేజ్ , అల్లు శిరీష్ హీరోలుగా తెర మీద కనిపించారు. అయ...

No comments: