టాలీవుడ్ లో హిట్ సినిమాలను ఇచ్చే దర్శకులు చాల అరుదు అని చెప్పాలి. ఇక మొదటి సినిమా తోనే హిట్ కొట్టే దర్శకులకు ఉండే క్రేజ్ మాములుగా ఉండదు. కాని కొంత మంది దర్శకులు హిట్ కొట్టిన సరే , తదుపరి సినిమా ఏంటి అనేది క్లారిటీ ఉండదు.
ప్రస్తుతానికి గోపీచంద్ మలినేని పరిస్థితి కూడా ఇలాగె ఉంది. డాన్ శీను సినిమా తో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న గోపి , తన రెండవ చిత్రం తో ఫ్లాప్ కొట్టాడు. ఆ తర్వాత రవి తేజ తో చేసిన బలుపు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో ఫ్లాప్ సినిమాల తర్వాత రవి తేజ కెరీర్ ని నిలబెట్టిన సినిమా " బలుపు ". బలుపు తర్వాత కూడా గోపి కి సినిమా తొందరగా రాలేదు. ఆఖరికి రామ్ హీరో గా " పండగ చేస్కో " సినిమా కి సైన్ చేసాడు. రొటీన్ సినిమా అయినప్పటికీ పండగ చేస్కో సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది.అయితే ,
ఈ సినిమా తర్వాత గోపి కి అవకాశాలే లేవు అని చెప్పాలి. ఎన్టీఆర్ తో కత్తి రీమేక్ చేద్దామని ప్రయత్నించిన ఫలితం లేదు. కొత్త కథ తో అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళిన సరే సినిమా ఓకే అవ్వలేదు. ఆఖరి ప్రయత్నంగా వరుణ్ తేజ్ తో కూడా సినిమా కి రెడీ అయ్యాడు గోపి, కాని అక్కడ కూడా మొండి చెయ్యి లభించింది. కళ్యాణ్ రామ్ తో సినిమా చేద్దాం అనే ప్లాన్ లో గోపి ఉన్నట్లు సమాచారం. మరి ఈ సినిమా అయిన ఓకే అవుతుందో లేదో చూడాలి.


No comments: