మెగా ఫ్యామిలి లో కొత్తగా వచ్చిన చుర కత్తి సాయి ధరం తేజ్. తొలి సినిమా నుండి మాస్ హీరో గా పేరు తెచ్చుకున్న సాయి ధరం తేజ్ , వరుసగా సినిమాలు సైన్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. పిల్ల నువ్వు లేని జీవితం సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి ధరం తేజ్ , ప్రస్తుతానికి సుప్రీమ్ , తిక్క సినిమాలతో బిజీ గా ఉన్నాడు.
అయితే దిల్ రాజ్ బ్యానర్ లో ఇప్పటికే 3 సినిమాలు చేసిన సాయి ధరం తేజ్ , సుప్రీమ్ తర్వాత దిల్ రాజు బ్యానర్ లో "శతమానం భవతి " సినిమా కూడా చేస్తానని ప్రకటించాడు కాని ఈ మధ్యనే ఈ సినిమాని రాజ్ తరుణ్ తో చేస్తున్నట్లు దిల్ రాజు ప్రకటించాడు. సాయి ధరం తేజ్ ఈ సినిమా కి సెట్ కాదు కాబట్టే రాజ్ తరుణ్ తో చేస్తున్నాం అని దిల్ రాజు చెప్పాడు.
ఇందులో నిజం లేకపోలేదు , అంతకు ముందు కూడా దిల్ రాజు , సాయి ధరం తేజ్ తో కేరింత సినిమా మొదలు పెట్టాడు కాని , సాయి ధరం తేజ్ కి సెట్ అయ్యే కథ కాదని , మొదట్లోనే సినిమాని ఆపేసాడు. ఆ సినిమా తర్వాత సుమంత్ అశ్విన్ చెయ్యడం మనకు తెలిసిందే. ఏది ఏమైనా సాయి ధరం తేజ్ మాత్రం ఈ సినిమా నుండి తప్పుకోడం మంచిదే అయ్యింది అంటున్నారు మెగా ఫాన్స్.


No comments: