బ్రూస్ లీ సినిమా తో భారి ఫ్లాప్ కొట్టిన రామ్ చరణ్ తన తదుపరి సినిమా విషయం లో చాల జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. తమిళ్ సూపర్ హిట్ సినిమా " తని ఒరువన్ " ని రీమేక్ చేస్తున్న అని ఇప్పటికే ప్రకటించాడు రామ్ చరణ్.
ఈ సినిమా ని అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. అయితే , ఈ రీమేక్ కి టైటిల్ " రక్షక్ " అని చాల మంది అనుకున్నారు కాని అనుకోని రీతి లో ఈ రోజు టైటిల్ బయట పెట్టారు యూనిట్ సభ్యులు. తని ఒరువన్ రీమేక్ కి " ధ్రువ " అనే టైటిల్ అనుకుంటున్నామని , ఈ నెల 18 నుండి షూటింగ్ మొదలవుతుంది ఫిల్మ్ నగర్ సమాచారం.ఇంకో వైపు ఈ సినిమా స్క్రిప్ట్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు సురేందర్ రెడ్డి. ఇప్పటికే తూఫాన్ లో పోలీస్ పాత్ర వేసిన చరణ్ రెండో సారి పోలీస్వె యునిఫోరం వెయ్యనున్నాడు .
ఆగష్టు లో విడుదల అయ్యే ఈ సినిమా మీద అభిమానులు భారి అంచనాలే పెట్టుకున్నారు. బ్రూస్ లీ పరాజయం నుండి చరణ్ బయటికి రావాలంటే , ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిన అవసరం ఉంది.


No comments: