టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ రెండు వరుస సినిమాల హిట్ తో మంచి జోష్ మీద ఉన్నాడు. షార్ట్ ఫిల్మ్స్ లో నటించే ఈ కుర్రాడికి ఉయ్యాలా జంపాల సినిమాలో అవకాశం వచ్చింది. ఈ చిన్న సినిమా మంచి విజయాన్ని అందుకోవటంతో ఆ తర్వాత రాజ్ తరుణ్ నటించిన 'సినిమా చూపిస్త మావ’ కూడా అదే రేంజ్ లో హిట్ అయ్యింది. ఇప్పుడు మూడో సినిమాగా సుకుమార్ నిర్మిస్తున్న 'కుమారి 21 ఎఫ్' కూడా హిట్ అయ్యి హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటాడని టాక్స్ విన్పిస్తున్నాయి.
అయితే రాజ్ తరుణ్ ఆలోచన మరొక రకంగా ఉంది. హీరోగా సక్సెస్ గా ఉన్న సమయంలో దర్శకత్వం మీదకు మనస్సు పోతుంది. తను ఒక కామెడి కథను రెడీ చేసుకున్నాడట. తనకి షార్ట్ ఫిల్మ్స్ చేసే సమయంలో స్క్రిప్ట్ తనే రాసుకోనేవాడట. ఈ కథను సునీల్ ని దృష్టిలో పెట్టుకొని రాసాడట. సునీల్ ఒప్పుకుంటే చేస్తాడట. లేదంటే వేరే హీరోతో అయినా చేయటానికి సిద్దం అయిపోయాడు యంగ్ హీరో రాజ్.


No comments: