కమల్ హసన్ కూతురిగా సినీ రంగ ప్రవేశం చేసినా ఆ తర్వాత తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవటంలో సఫలం అయ్యింది శృతి హసన్. మొదట్లో పరాజయాలు పలకరించినా దైర్యం కోల్పోకుండా తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంది. ఆమె 'గబ్బర్ సింగ్' సినిమా విజయంతో వెనుకకు తిరిగి చూసుకొనే అవకాశమే రాలేదు. ఇప్పుడు 'శ్రీమంతుడు' సినిమా హిట్ తో ఆమంచి జోష్ లో ఉంది ఈ భామ. 'శ్రీమంతుడు' సినిమాలో నటించినందుకు అక్షరాల కోటి రూపాయిలు తీసుకుందట.
ఈ అమ్మడి రేంజ్ కోటి అనుకొనే లోపే మరో అరకోటి పెంచేసింది. చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తున్న మలయాళ రీమేక్ 'ప్రేమమ్' లో శృతి హసన్ ని నటించమని అడిగారట. ఆమె కోటిన్నర అడిగిందని సమాచారం. ఈ సినిమాకి కోటి రూపాయిలు ఇవ్వటమే ఎక్కువ అని భావించినా దర్శక నిర్మాతలు ఆశ్చర్యపోయారట. కానీ చైతూ, శృతి కాంబినేషన్ కొత్తగా ఉంటుందని భావించి శృతి అడిగిన మొత్తాన్ని ఇవ్వటానికి రెడీ అయినట్టు సమాచారం.


No comments: