రానా సెంటిమెంట్ ఫీల్ అవుతున్నాడా? - Telugu Its Telugu

728x90 AdSpace

Thursday, 8 October 2015

రానా సెంటిమెంట్ ఫీల్ అవుతున్నాడా?


ఎన్నో కష్టాలను దాటుకొని రేపు విడుదల అవుతున్న 'రుద్రమదేవి' కి అన్ని పాజిటివ్ గా జరుగుతున్నా రానా సెంట్ మెంట్ ఒకటి భయపెడుతుందని సమాచారం. సాదారణంగా సినీ పరిశ్రమ అనేది కోట్లతో వ్యవహారం కాబట్టి హీరోలకు,దర్శక నిర్మాతలకు సెంట్ మెంట్ మెండుగా ఉంటుంది. అయితే రానాకు ఒక విచిత్రమైన బాబాయి సెంట్ మెంట్ పట్టుకుంది. తన బాబాయి రోమాన్స్ చేసిన హీరోయిన్స్ రానా రోమాన్స్ చేస్తే ఘోరంగా దెబ్బ తింటున్నాడు.

గతంలో వెంకటేష్ తో ‘సుభాష్ చంద్రబోస్’ లో నటించిన జెనిలియా తో రానా 'నా ఇష్టం' చేసాడు. అది పరాజయాన్ని చూసింది. ఆ తర్వాత 'తులసి', 'లక్ష్మి' సినిమాల్లో నటించిన నయనతారతో చేసిన ‘కృష్ణం వందే జగద్గురుం’ కూడా కలిసి రాలేదు. ఇప్పుడు ‘చింతకాయల రవి’ లో నటించిన అనుష్కతో రుద్రమదేవి లో రోమాన్స్ చేస్తున్నాడు. మరి ఇది ఏమి అవుతుందో అని తెగ ఫీల్ అవుతున్నాడు దగ్గుపాటి వారసుడు. ప్రస్తుతం 'రుద్రమదేవి' పాజిటివ్ టాక్స్ తో నడుస్తుంది. కాబట్టి రానా టెన్షన్ పడవలసిన అవసరం లేదు.
రానా సెంటిమెంట్ ఫీల్ అవుతున్నాడా? Reviewed by Unknown on 09:21 Rating: 5 ఎన్నో కష్టాలను దాటుకొని రేపు విడుదల అవుతున్న 'రుద్రమదేవి' కి అన్ని పాజిటివ్ గా జరుగుతున్నా రానా సెంట్ మెంట్ ఒకటి భయపెడుతుందని సమాచా...

No comments: