మన టాలీవుడ్ లో ఒక సెంట్ మెంట్ ఉంది. అది ఏమిటంటే రాజమౌళి ఏదైనా సినిమా గురించి ట్విట్ చేసాడంటే ఖచ్చితంగా ఆ సినిమా హిట్ అవుతుంది. సాదారణంగా రాజమౌళి సినిమా బాగా నచ్చితేనే ట్విట్ చేస్తాడు. ఏదో మొహమాటానికి మాత్రం చేయడు. ఇప్పుడు రేపు విడుదల అవుతున్న 'రుద్రమదేవి' గురించి ఒక ట్విట్ చేసాడు. ఈ సినిమాను రాజమౌళి 2 డీ ఫార్మెట్ లోను ,అయన కుటుంబ సభ్యులు మాత్రం 3డీ ఫార్మెట్ లో చూస్తారట.
గుణశేఖర్ కి ఈ విషయంతో పాటు ఆనందం కలిగించే మరో విషయం కూడా ఉంది. గుణశేఖర్,దిల్ రాజు కలిసి తెలంగాణా ముఖ్యమంత్రి కేసియర్ ని కలిసి వినోద పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ సినిమా తెలంగాణా వీర వనిత రుద్రమ సినిమా కావటంతో వినోద పన్ను మినహాయింపు తో పాటు ఈ సినిమాని కూడా చూస్తానని హామీ ఇచ్చారు కేసియర్. ఇప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మినహాయింపు ఇస్తే గుణకి చాలా కలిసి వస్తుంది.


No comments: