ఈ టివీలో ప్రసారం అవుతున్న జబర్ధస్త్ ప్రొగ్రామ్ లో చాలా పాపులారిటిని సంపాదించటమే కాకుండా ఆ ప్రోగ్రాంకి కూడా చాలా ప్లస్ అయింది అనసూయ. ఆమె ఆ ప్రోగ్రాంలో ఒక రేంజ్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే తప్పుకొని సినిమాల వైపు చూసింది. కానీ సినిమాల్లో ఐటం పాటలకు ఎక్కువగా అవకాశాలు వచ్చాయి. కానీ ఆమె హీరోయిన్ గా చేయటానికే మొగ్గు చూపింది. పవర్ స్టార్ సరసన ఐటం పాటలో నటించటానికి కూడా నో చెప్పి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
ఆమె మంచి అవకాశం కోసం వేచి చూసింది. ఆమె ప్రయత్నం ఫలించి నాగార్జున సినిమా 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలో కీలకమైన పాత్రను కొట్టేసింది. అంతేకాక ఆమె తీసుకున్న పారితోషికం వింటే అమ్మో అన్పిస్తుంది. ఒక యాంకర్ కి అంత పారితోషికమా అని అనిపిస్తుంది. ఆమెకు రోజుకు నాలుగు లక్షల చొప్పున పది రోజులకు గాను నలబై లక్షల పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. బుల్లితెర మీద ఆమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ మొత్తం పెద్ద లెక్క కాదు.


No comments: