అక్కినేని వారసుడు వెనక్కి వెళ్ళుతున్నాడా? - Telugu Its Telugu

728x90 AdSpace

Wednesday, 7 October 2015

అక్కినేని వారసుడు వెనక్కి వెళ్ళుతున్నాడా?


అక్కినేని వారసుడు అఖిల్ నటిస్తున్న సినిమాను మాస్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను అభిమానుల ముందుకు దసరాకి రావాలని ప్లాన్ చేసింది. కానీ ఇప్పుడు దసరాకి వచ్చే పరిస్థితి కనపడటం లేదు. ఎందుకంటే ఈ నెల 9న 'రుద్రమదేవి',ఆ తర్వాత ఒక వారం తర్వాత 'బ్రూస్ లీ' వస్తున్నాయి. ఈ సినిమాలు కనుక హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం అఖిల్ సినిమాకి దియేటర్స్ దొరకటం కష్టమని డిస్ట్రిబ్యూటర్స్ సినిమాను విడుదల వాయిదా  వేయమని అంటున్నారట.
అయితే నితిన్ మాత్రం సినిమాని ఏమైనా సరే దసరాకి విడుదల చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాడు. నితిన్ ఇంత పట్టుదలతో ఉంటే డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమాని దసరాకి విడుదల చేస్తే డ్రాప్ అయ్యిపోతామని అంటున్నారు. అంతేకాక వారు పెద్ద మొత్తం పెట్టి హక్కులను తీసుకోని నష్టపోవటానికి సిద్దంగా లేమని వాయిదా తప్పనిసరిగా వేయాలని అంటున్నారు. కాకపోతే నితిన్ మాత్రం అనుకున్న ప్రకారమే సినిమా విడుదల చేస్తానని అంటున్నాడు. అయితే అక్కినేని వారసుడు మొదటి సినిమాని సరైన సమయంలో విడుదల  చేయకపోతే మాత్రం అసలుకే మోసం రావచ్చు.
అక్కినేని వారసుడు వెనక్కి వెళ్ళుతున్నాడా? Reviewed by Unknown on 11:06 Rating: 5 అక్కినేని వారసుడు అఖిల్ నటిస్తున్న సినిమాను మాస్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ...

No comments: