రుద్ర‌మ‌దేవికి సీక్వెల్‌ రావటం లేదా? - Telugu Its Telugu

728x90 AdSpace

Wednesday, 7 October 2015

రుద్ర‌మ‌దేవికి సీక్వెల్‌ రావటం లేదా?



రుద్ర‌మ‌దేవికి సీక్వెల్‌గా ప్రతాపరుద్రుడు సినిమా తీస్తానని గుణశేఖర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాక చరణ్,ఎన్టీఆర్,మహేష్ బాబు వంటి వారు నటించటానికి సిద్దంగా ఉన్నారని ఊదరకొట్టేసాడు గుణ. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలేక్కే స్థితిలో లేదు. ఎందుకంటే ఈ వార్తను కేవలం రుద్రమదేవి సినిమాకి హైప్ ని తీసుకురావటానికి మాత్రమే గుణ చెప్పాడని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు విన్పిస్తున్నాయి.
గుణ కూడా ఏదో కుదిరితే సీక్వెల్ చేద్దామని అనుకున్నా కానీ స్క్రిప్ట్ ఇంకా ఏమి సెట్ కాలేదని చెప్పాడు . అంతే కాకా రుద్రమదేవికి మంచి రెస్పాన్స్ వచ్చి బాగా హిట్ అయ్యితే మాత్రం ప్రతాపరుద్రుడు గురించి ఆలోచిస్తా అని అంటున్నాడు.  అయినా గుణ తన కలల ప్రాజెక్ట్ రుద్రమదేవి సినిమా కోసం పడని కష్టం లేదు. ఈ చారిత్ర‌క నేపధ్యం కలిగిన ఈ సినిమాను తీయటానికి ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి దాదపుగా 60 కోట్లను ఖర్చు పెట్టాడు. ఇన్ని రిస్క్ లు తీసుకోని 'రుద్రమదేవి' ని తీసిన గుణ 'ప్రతాపరుద్రుడు' తీయటానికి సాహసం చేయకపోవచ్చు.
రుద్ర‌మ‌దేవికి సీక్వెల్‌ రావటం లేదా? Reviewed by Unknown on 10:59 Rating: 5 రుద్ర‌మ‌దేవికి సీక్వెల్‌గా ప్రతాపరుద్రుడు సినిమా తీస్తానని గుణశేఖర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాక చరణ్,ఎన్టీఆర్,మహేష్ బాబు వంటి వారు ...

No comments: