కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా 'పులి' లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 1 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. కానీ కధలో పస లేకపోవటం గ్రాఫిక్స్ కూడా ఆకర్షణగా లేకపోవటం వంటి కారణాలతో 'పులి' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అంతేకాక విడుదల విషయంలో జరిగిన గందరగోళానికి కూడా పులి నష్టపోయింది.
తమిళనాడులో చెన్నై లో మాత్రం కలెక్షన్స్ పరవాలేదని అనిపించినా, మిగతా ప్రాంతాల్లో అంతంత మాత్రంగానే ఉన్నాయట. సినిమా విడుదలకు ముందు విజయ్ డిస్ట్రిబ్యూటర్స్ కు సినిమా చాలా బాగా వచ్చిందని మీరు ఏ ఏరియా అయిన సంకోచం లేకుండా తీసుకోవచ్చని చెప్పాడట. అయితే పులి సక్సెస్ కాకపోవటంతో డిస్ట్రిబ్యూటర్స్ తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు వీరు విజయ్ ని నష్టపరిహారం అడుగుతున్నారట. దాంతో విజయ్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేసాడట. అంతేకాక కొన్ని రోజులు ప్రశాంతంగా గడపటానికి ఫారిన్ ట్రిప్ వేస్తున్నాడు.


No comments: