పవన్ సెంట్ మెంట్ ని నమ్ముతున్నాడా? - Telugu Its Telugu

728x90 AdSpace

Wednesday, 7 October 2015

పవన్ సెంట్ మెంట్ ని నమ్ముతున్నాడా?


పవర్ స్టార్ నటించిన 'గబ్బర్ సింగ్' ఎంతటి విజయాన్ని సాదించినదో మనకు తెలిసిన విషయమే. అలాగే అంతటి విజయాన్ని అందించిన గబ్బర్ సింగ్ అంటే పవన్ కి కూడా చాలా మోజు. ఆ మోజుతోనే 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఏదో ఒక న్యూస్ హాల్ చల్ చేస్తూ సినిమాపై హైప్ ని పెంచుతుంది. రీసెంట్ గా ఒక విషయం బయటకు వచ్చింది.

'గబ్బర్ సింగ్' సినిమాలో అంత్యాక్షరి  ఎపిసోడ్ గుర్తు ఉంది కదా. అదే తరహాలో ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టుగా మార్పులు చేసి 'సర్దార్ గబ్బర్ సింగ్' లో పెట్టాలని నిర్ణయించారని సమాచారం. అంతేకాక ఈ అంత్యాక్షరి ఎపిసోడ్ లో పవన్ అదిరిపోయే స్టెప్స్ కూడా వేస్తున్నాడని సమాచారం. 'గబ్బర్ సింగ్' సినిమా విజయంలో ఈ అంత్యాక్షరి ఎపిసోడ్ కూడా ఒక కారణం. అందుకే ఈ సినిమాలో కూడా కామెడి ఏ మాత్రం మిస్ కాకుండా చూడమని పవన్ గట్టిగా చెప్పటంతో చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుందట.
పవన్ సెంట్ మెంట్ ని నమ్ముతున్నాడా? Reviewed by Unknown on 10:51 Rating: 5 పవర్ స్టార్ నటించిన 'గబ్బర్ సింగ్' ఎంతటి విజయాన్ని సాదించినదో మనకు తెలిసిన విషయమే. అలాగే అంతటి విజయాన్ని అందించిన గబ్బర్ సింగ్ అంటే...

No comments: