'రుద్రమదేవి' లో గోనగన్నారెడ్డి టైం! - Telugu Its Telugu

728x90 AdSpace

Tuesday, 6 October 2015

'రుద్రమదేవి' లో గోనగన్నారెడ్డి టైం!


రుద్రమదేవి భారతదేశపు తొలి హిస్టారికల్‌ స్టీరియోస్కోపిక్‌ 3డి మరియు భారీ బడ్జెట్ తో గుణశేఖర్ కలల ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రుద్రమదేవిగా అనుష్క, ఆమె భర్త చాళుక్య వీరభద్రుని పాత్రలో రానా నటిస్తున్నాడు. రుద్రమదేవి చరిత్రలోనే అతి ముఖ్యమైన పాత్ర గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ నటిస్తున్నాడు. మొదట అల్లు అర్జున్ పాత్ర కేవలం అతిథి పాత్రగా  షూట్ చేసారు. అయితే బన్ని పాత్ర తక్కువగా ఉండటం కేవలం అనుష్క ఇమేజ్ తో బిజినెస్ సరిగ్గా జరగకపోవటంతో బన్ని పాత్ర నిడివిని పెంచారు.

అలాగే ఈ సినిమాను 'రుద్ర' పేరుతో మలయాళంలో కూడా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. మలయాళంలో కూడా బన్నికి మంచి ఫాలోయింగ్ ఉండటంతో 'రుద్రమదేవి' లో బన్ని పాత్రను 50 నిమిషాలకు పెంచారు. ఈ విధంగా పెంచటం వలన బిజినెస్ తోపాటు, మలయాళంలో కూడా మంచి ఓపినింగ్స్ రాబట్టవచ్చు. మొదట ఈ పాత్ర కోసం మహేష్ బాబు ని సంప్రదించాడు గుణ. మహేష్ నో చెప్పటంతో ఈ పాత్ర బన్ని దగ్గరకు వచ్చింది. చరిత్రలో గోనగన్నారెడ్డి ఒక బందిపోటు. ఈ సినిమాలో అయన బందిపోటుగా ఎందుకు ఎలా మారాడో చూపుతున్నారు.
'రుద్రమదేవి' లో గోనగన్నారెడ్డి టైం! Reviewed by Unknown on 05:07 Rating: 5 రుద్రమదేవి భారతదేశపు తొలి హిస్టారికల్‌ స్టీరియోస్కోపిక్‌ 3డి మరియు భారీ బడ్జెట్ తో గుణశేఖర్ కలల ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిం...

No comments: