ఐదు పదులు వయస్సు వచ్చినా సరే టాలీవుడ్ మన్మధుడు ఎక్కడ తగ్గకుండా ముందుకు వెళ్ళుతున్నాడు. నాగ్ సినిమా అంటేనే గ్లామర్ అని అర్ధం. హీరోయిన్స్ తో అయితే నాగ్ కెమిస్ట్రీ అదిరిపోతుంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న `సోగ్గాడే చిన్ని నాయనా` సినిమాలో నలుగురితో ఆడి పాడనున్నాడు. డ్యుయల్ రోల్ పోషిస్తున్న నాగ్ రమ్యకృష్ణ - లావణ్య త్రిపాఠి లతో రోమాన్స్ చేస్తుండగా, హంసానందిని - అనసూయ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. సాదారణంగా సినిమాల్లో హీరోలు హీరోయిన్స్ కి మాత్రమే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వటం జరుగుతుంది.
కానీ నాగ్ మాత్రం నలుగురు హీరోయిన్స్ కి సమాన ప్రాధాన్యత ఇస్తున్నాడు. వారిలో అనసూయకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. చిన్న పాత్రలను పోషించిన నటులకు సినిమా ప్రమోషన్ లో బాగం చాలా తక్కువగా ఉంటుంది. కానీ నాగ్ మాత్రం తాను విడుదల చేసే పోస్టర్స్ లో అనసూయ ఉండేలా చూస్తున్నాడు. అనసూయకు ఉన్న క్రేజ్ ని ఉపయోగించుకోవటం, అలాగే అనసూయ నటన,అందం నాగ్ కి బాగా నచ్చటంతో అనసూయ మీద ఎక్కువ దృష్టి పెట్టాడని ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే అనసూయ బిజీగా మారటం ఖాయం.


No comments: