టాలీవుడ్,కోలీవుడ్ లలో దేవిశ్రీ అంటే తెలియని వారు ఉండరు. తన సంగీతంతో ఎన్నో మ్యూజికల్ హిట్స్ కొట్టాడు. ఒక స్టార్ హీరోకి ఎంత క్రేజ్ ఉంటుందో అంతటి క్రేజ్ ని ఒక సంగీత దర్శకుడిగా సంపాదించాడు దేవిశ్రీ. సినిమా ఆడియో వేడుకల్లో ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తన స్టెప్స్ తో అభిమానులను హోరు ఎత్తిస్తాడు. దాంతో ఆ వేడుకల్లో సెంట్రల్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యిపోతూ ఉంటాడు. చాలా కాలం నుంచి దేవిశ్రీ హీరోగా ఎంట్రీ ఇస్తాడనే వార్త ప్రచారం జరుగుతుంది.
కానీ దానికి బిన్నంగా మరో అవతారం ఎత్తాడు దేవిశ్రీ. సుకుమార్ నిర్మాతగా మారి రాజ్ తరుణ్ హీరోగా 'కుమారి 21 ఎఫ్' సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మ్యూజిక్ ని దేవిశ్రీ కంపోజ్ చేస్తున్నాడు. ఆ సినిమాలో తాను స్వరపరచిన ఒక పాటకు డాన్స్ కంపోజ్ కూడా చేస్తున్నాడని చిత్ర యూనిట్ అంటోంది. ఇప్పటివరకు పాటలను రాయటం,పాడటం, మ్యూజిక్ కంపోజ్ చేసిన దేవిశ్రీ కొరియోగ్రాఫర్ గా కూడా రాణిస్తాడని ఆశిద్దాం.


No comments: