ఇలియానా పెళ్లి పీటలు ఎక్కటానికి సిద్దం అయిందా? - Telugu Its Telugu

728x90 AdSpace

Monday, 5 October 2015

ఇలియానా పెళ్లి పీటలు ఎక్కటానికి సిద్దం అయిందా?


గోవా సుందరి ఇలియానా పెళ్లి పీటలు ఎక్కటానికి సిద్దం అయిందనే వార్త హాల్ చల్ చేస్తుంది. ఎందుకంటే ఆమెకు రహస్యంగా నిశ్చితార్థం జరిగిందనే వార్తలు గుప్పుమన్నాయి.  ఎంతో ఆశతో బాలీవుడ్ కి వెళ్ళిన ఈ భామకు నిరాశే ఎదురయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా పెద్ద అవకాశాలు కూడా లేవు. అయితే ఈ మధ్య కాలంలో గోవా బ్యూటీ ఆస్ట్రేలియాకు చెందిన బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూతో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ రహస్యంగా నిశ్చితార్థం జరిగిందట. ఈ వేడుకకు సినీ రంగానికి చెందిన వారెవరికి ఆహ్వానాలు అందలేదు.

ఆండ్రూ ఆస్ట్రేలియాకు చెందిన ఒక  ప్రొఫెషనల్ ఫోటో గ్రాఫర్. ఇలియానా,ఆండ్రూ కి గత రెండు సంవత్సరాల నుండి పరిచయం సాగి ఇప్పటికి నిశ్చితార్థం వరకు వచ్చింది. అయితే ఈ అమ్మడు జాకిచాన్ సరసన నటిస్తుందనే వార్తలు వచ్చినా సరే ఆ విషయాన్ని ఎవరు కన్ఫర్మ్ చేయలేదు. బాలీవుడ్ నుంచి పరాజయాల భారంతో  టాలీవుడ్ కి వచ్చిన ఇలియానాకు పెద్దగా అవకాశాలు ఏమి రాలేదు. దాంతో అమ్మడు జీవితంలో సెటిల్ అవ్వాలని అనుకుంటుందని సమాచారం.
ఇలియానా పెళ్లి పీటలు ఎక్కటానికి సిద్దం అయిందా? Reviewed by Unknown on 09:40 Rating: 5 గోవా సుందరి ఇలియానా పెళ్లి పీటలు ఎక్కటానికి సిద్దం అయిందనే వార్త హాల్ చల్ చేస్తుంది. ఎందుకంటే ఆమెకు రహస్యంగా నిశ్చితార్థం జరిగిందనే వార్తలు...

No comments: