'భలే భలే మగాడివోయి' బాలీవుడ్ కి వెళ్ళుతుందా? - Telugu Its Telugu

728x90 AdSpace

Saturday, 3 October 2015

'భలే భలే మగాడివోయి' బాలీవుడ్ కి వెళ్ళుతుందా?


'భలే భలే మగాడివోయి' సినిమా విడుదల అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. పరాజయాల

బాటలో ఉన్న నానికి ఈ సినిమా హిట్ మంచి ఊరటను ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ సినిమా సునీల్, అల్లరి నరేష్
లను దాటుకొని మరీ నాని ముందుకు వచ్చింది. చిన్న సినిమా అయినా కథ,కథనం బాగుంటే ప్రేక్షకులు బ్రహ్మరధం
పడుతున్నారు.

ఈ సినిమా హిట్ తో మారుతితో సినిమాలు చేయటానికి స్టార్ హీరోలు కూడా సిద్దంగా ఉన్నారు. అలాగే నాని, లావణ్య
త్రిపాఠి కి కూడా ఎన్నో అవకాశాలను తెచ్చి పెడుతుంది ఈ సినిమా.  లో బడ్జెట్ తో తీసిన సినిమా అనేక రెట్ల
లాభాన్ని సాదించటంతో ఈ సినిమాపై బాలీవుడ్ కన్ను పడింది. ఇప్పటివరకు సుమారుగా 27 కోట్లను వసూలు
చేయటంతో ఈ కథ యుత్ గా బాగా కనెక్ట్ అయిందని భావించి  బాలీవుడ్ వారు ఈ సినిమా రైట్స్ కోసం పోటీ
పడుతున్నారు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ కి మన తెలుగు సినిమాలను  రీమేక్ చేస్తే వారికీ కాసుల పంట

 పండుతోంది. అందుకే వారు టాలీవుడ్ లో విడుదల అయ్యిన సినిమాలపై ఒక కన్నేసి ఉంచుతున్నారు.
'భలే భలే మగాడివోయి' బాలీవుడ్ కి వెళ్ళుతుందా? Reviewed by Unknown on 21:27 Rating: 5 'భలే భలే మగాడివోయి' సినిమా విడుదల అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. పరాజయాల బాటలో ఉన్న నానికి ఈ సినిమా హిట్ మంచి ఊరటను...

No comments: