ఇంకో మెగా ప్రాజెక్ట్ లో లావణ్య - Telugu Its Telugu

728x90 AdSpace

Sunday, 28 February 2016

ఇంకో మెగా ప్రాజెక్ట్ లో లావణ్య

ఇంకో మెగా ప్రాజెక్ట్ లో లావణ్య


అందాల రాక్షసి సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ లావణ్య. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన ఈ బెంగాలీ అమ్మాయి , ఆ తర్వాత దుసుకేల్తా , భలే భలే మగాడివోయ్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది.ప్రస్తుతానికి అల్లు శిరీష్ సరసన నటిస్తున్న లావణ్య త్వరలోనే ఇంకో మెగా హీరో తో జత కట్టనుంది.

వివరాల్లోకి వెళితే , వరుణ్ తేజ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వం లో ఒక సినిమా ప్లానింగ్ లో ఉంది. ఇప్పటికే శ్రీను వైట్ల ఒక లైన్ వినిపించాడు , ఈ సబ్జెక్టు ని వైట్ల - గోపి మోహన్ కలిసి డెవలప్ చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమా లో హీరోయిన్ గా లావణ్య ని ఎన్నుకున్నారు.

మార్చ్ నుండి మొదలయ్యే ఈ సినిమా కి నిర్మాత ఇంకా ఖరారు కావాల్సి ఉంది. కంచె సినిమా తర్వాత వరుణ్ చాల సినిమాలు అనుకున్నాడు కాని , ఆఖరికి శ్రీను వైట్ల కె ఫిక్స్ అయ్యాడని ఫిల్మ్ నగర్ సమాచారం. మొత్తానికి లావణ్య , మెగా క్యాంపు నుండి బయటకి రాకుండా బానే ఉంటుంది అని కామెంట్లు వేస్తున్నారు విశ్లేషకులు.
ఇంకో మెగా ప్రాజెక్ట్ లో లావణ్య Reviewed by Unknown on 08:26 Rating: 5 అందాల రాక్షసి సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ లావణ్య. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన ఈ బెంగాలీ అమ్మాయి , ఆ తర్వాత...

No comments: