సాయి ధరం తేజ్ - గోపీచంద్ సినిమా మొదలయ్యింది - Telugu Its Telugu

728x90 AdSpace

Sunday, 28 February 2016

సాయి ధరం తేజ్ - గోపీచంద్ సినిమా మొదలయ్యింది

సాయి ధరం తేజ్ - గోపీచంద్ సినిమా మొదలయ్యింది



సాయి ధరం తేజ్ అనుకున్నట్లుగానే గోపీచంద్ మలినేని సినిమా ఓకే చేసాడు. నిజానికి గోపీచంద్ మలినేని , ఎన్టీఆర్ తో ఒక సినిమా చెయ్యడానికి చాల ప్రయత్నించాడు , ఆ తర్వాత అల్లు అర్జున్ , కళ్యాణ్ రామ్ చుట్టూ కూడా చక్కర్లు కొట్టాడు కాని , సినిమా కుదరలేదు.

ఇక తాజాగా వరుణ్ తేజ్ తో సినిమా చేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి కాని అది కూడా చివర వరకు రాలేదు. మొత్తానికి , సాయి ధరం తేజ్ తో సినిమా చెయ్యడానికి సిద్ధం అయ్యాడు గోపీచంద్ మలినేని. ఈ సినిమా లాంచనంగా నిన్న ప్రారంభం అయ్యింది.

చాల సింపుల్ గా స్టార్ట్ అయిన ఈ సినిమా ఓపెనింగ్ కి గోపీచంద్ గురువు మురుగదాస్ కూడా హాజర అయ్యాడు. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా లో రాకుల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఠాగూర్ మధు , నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న ఈ సినిమా ని మార్చ్ లో మొదలు పెట్టి దసరా కానుకగా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతానికి సాయి ధరం తేజ్ , సుప్రీమ్ , తిక్క సినిమాల్లో బిజీ గా ఉన్నాడు.
సాయి ధరం తేజ్ - గోపీచంద్ సినిమా మొదలయ్యింది Reviewed by Unknown on 10:08 Rating: 5 సాయి ధరం తేజ్ అనుకున్నట్లుగానే గోపీచంద్ మలినేని సినిమా ఓకే చేసాడు. నిజానికి గోపీచంద్ మలినేని , ఎన్టీఆర్ తో ఒక సినిమా చెయ్యడానికి చాల ...

No comments: