ఇలాంటి చర్చ మద్యలో . అశ్విని దత్ ఒక పెద్ద షాక్ ఇచ్చాడు. శక్తి సినిమా తర్వాత తన బ్యానర్ లో పెద్ద సినిమా రావడం ఆగిపోయాయి. కాని అశ్విని దత్ మాత్రం మహేష్ తో ఒక సినిమా చేస్తాను అని గత 3 ఏళ్ళుగా చెప్పుకుంటు వస్తున్నాడు. ముందుగా పూరి తో సినిమా చేస్తానన్ ప్రకటించిన అశ్విని దత్ , ఆ తర్వాత క్రిష్ - మహేష్ కాంబినేషన్ లో సినిమా అని ప్రకటించాడు.
సినిమా పేరు శివం అని కూడా అన్నారు కాని అది పట్టలేక్కలేదు. ఇప్పుడు అశ్విని దత్ కొత్త పేరు ని ప్రస్తావిస్తున్నాడు. మీడియా తో మాట్లాడుతూ , తను మహేష్ - గౌతం మీనన్ కాంబినేషన్ లో ఒక సినిమా అనుకుంటున్నా అని , అది వచ్చే ఏడాది మొదలవుతుందని ప్రకటించాడు. మరి ఈసారి అయిన ప్రాజెక్ట్ పట్టలేక్కుతుందో లేదో చూడాలి.


No comments: